1. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది, రి షెడ్యూల్ ప్రకారం జనవరి 6,7 తేదీలలో జరగాల్సివుంది. కానీ tspsc కమిషన్ గ్రూప్ పైన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీనితో నిరుద్యోగులు చాలా నిరాశగా వున్నారు అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా ఎప్పుడు జరుగుతుంది tspsc ప్రక్షాళన ఎప్పుడు అని ఎదురుచూసన్నారు అయినా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం లనే ఉండటం తో ఎమ్ చేయాలో దిక్కు తోచని స్థితిలో నిరుద్యోగ యువత వున్నారు.కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ హామీలు లో భాగంగా 1 ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ముందడుగు పడట్లేదు. అదే కాకా నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఒక నెలకి అని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు మేము ఎక్కడ చెప్పలేదు అని గత ప్రభుత్వం లాగే నిర్లక్ష్యం చూపిస్తున్నారు.గత అసెంబ్లీ సెషన్ లో డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క గారు నిరుద్యోగ భృతి మేము ఎక్కడ ఇస్తాము అన్నము అధ్యక్ష అనడం తో నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీ ని విజయం లో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువతే.
    తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించడం కోసం తేదీలను ఖరారు చెసింది కానీ వరుస ఎగ్జామ్స్ పేపర్ లీక్ లతో విద్యార్థులు తక్కువ సమయం లో ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుంది అని పోస్టుపోన్ చేయాలనీ చలో tspsc నిర్వహించడం జరిగింది దీనితో tspsc నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది అని ప్రకటించారు. కానీ చివరకి మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ రావడం తో మళ్ళీ కొత్త తేదీలు ప్రకటించారు జనవరి 6,7 తేదీలలో అని కానీ ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ అయ్యే అవకాశం 100% వుంది.